Aravind Ajad's Random Thoughts / అరవింద్ ఆజాద్, నా పనికి మాలిన ఆలోచనలు

Saturday, July 21, 2007

పిల్లల కోసం చక్కని తెలుగు కధలు..

http://telugu4kids.com/default.aspx

పిల్లల కోసం నడుపుతున్న ఈచక్కని వెబ్ సైటు ని మీరు తప్పక చూడాలి. కధలు, పద్యాలు అన్నీ చక్కని వాచకంతో ఉన్నాయి. నిర్వాహకులు లలిత మరియు వారి కుటంబానికి నా కృతఙతలు. ఇది నిజంగా web 2.0 నే.

-అరవింద్

ఈనాడు ఈ-పేపరు

క్రితం వారం ఈనాడు లో ఈ న్యూస్ చూసాను. ఈ-పేపరు. అసలు news paper ని scan చేసి అదే format లో వెబ్ లో పెట్టారన్న మాట. scan copy ని చదవ గలమా అని సందేహం అక్కర్లేదు. ఎందుంకంటే ప్రతీ వార్తా విశషం ని hyperlink తో పెద్దది చేసుకొని చదవొచ్చు. ఇంకో విశషం ఏమిటంటే జిల్లా editions తో సహా అన్ని అందుబాటు లో ఉంచారు. ఇది తెలుగు ఇంటర్నెట్ ప్రపంచం లో ఒక క్రొత్త వరవడి. ఈనాడు కు నా శుభాకాంక్షలు. అయితే మరి ఇది ప్రస్తుతానికి ఉచితం కాని త్వరలోనే చందా కట్టాలి రావచ్చు. ఎందుకంటే ఈనాడు వాడే software లో ఆ option తాత్కాలికంగా (౩ నెలలు) ఆపారు మరి. చందా నామమాత్రం గా ఉంటుందని ఆశిస్తూ..
http://epaper.eenadu.net/

మరి ఉచితంగా ఉన్నప్పుడే ఆనందించండి.

-అరవింద్

మొదటి తెలుగు రాత

నిన్ననే నేను Baraha IME మరియు Windows XP Indic support ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్ని సంవత్సరాల కంప్యూటరు అనుభవం తర్వాత తెలుగు లో టైపు చెయ్యటం నిజంగానే గొప్ప అనుభూతి. మరిన్ని రాతల కోసము మీరు ఎదురు చూడాల్సిందే...

-అరవింద్